E-PAPER

ఆదివాసీల పేరు చెప్పి బెదిరిస్తే నాకు ఫోన్ చేయండి;ఊకే .ముద్ద రాజు

మణుగూరు, ఏప్రిల్ 11 వై 7 న్యూస్;

అందరికీ నమస్కారం. నా పేరు ఊకే .ముద్ద రాజు. మణుగూరు ఆదివాసి జేఏసీ ముఖ్య సలహాదారు మరియు పినపాక కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి..మణుగూరు ప్రజలకు ముఖ్య గమనిక…మణుగూరు వ్యాప్తంగా ఆదివాసి కుల సంఘాల పేరు చెప్పి కొంతమంది సంఘ నాయకులు, పెద్దలుగా చలామణి అవుతున్న ఆదివాసి ద్రోహులు చిన్నాచితక అన్ని రకాల వ్యాపారస్తులను, గృహ యజమానులను ఆదివాసీల వివిధ సంఘాల పేరుతో బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. మీరు ఎవరికీ ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.. మీకు మేము అండగా ఉంటాం. నిజమైన ఆదివాసీలు ఎవరు ఇలాంటి పనులు చేయరు.వీరి వల్ల ఆదివాసి సమాజం చిన్న చూపుకు, ఏవగింపుకు గురవుతుంది కావున ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరైనా ఆదివాసీలమని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తే, ప్రతి మండలంలో ఆదివాసి జేఏసీ టీములు కలవు వారి దృష్టికి సమస్యను
తీసుకువెళ్లండి.బెదిరింపులకు పాల్పడుతున్న వారి నుండి మీకు రక్షణ కల్పిస్తారు..
ఊకే.ముద్దరాజు,
మణుగూరు ఆదివాసి జేఏసీ ముఖ్య సలహాదారు.
ఫోన్ నెంబర్; *83748 19570* ను సంప్రదించగలరు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News