మేమున్నామంటూ ధైర్యం చెప్పిన తోటి ఉద్యోగులు.
మణుగూరు, మార్చి 12 వై 7 న్యూస్ తెలుగు;
మణుగూరు సింగరేణి ఏరియాలో ఎస్ఎంపిసి ఎం ఎం ఏ ప్రైవేట్ సెక్యూరిటీ లో సెక్యూరిటీ సుమారు ఏడు సంవత్సరాలు విధులు నిర్వహించిన సతీష్ అనారోగ్యం కారణంగా తానంతట తానుగా ఉద్యోగం నుండి వైదొలగారు. తోటి కార్మికుని ఆర్థికంగా ఆదుకోవాలన్న దృక్పథంతో.. సెక్యూరిటీ గార్డులు 32 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి శాలువాతో సత్కరించారు.
సెక్యూరిటీ సూపర్వైజర్ రాముతార్, సుధాకర్ లు మాట్లాడుతూ …టీ సతీష్ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వైదొలగడం మాకు బాధాకరమైన విషయమన్నారు.ఈ కార్యక్రమంలో సుధీర్, వి శ్రీనివాసరావు,గుత్తుల శ్రీను, శేఖర్ బాబు,యాకూబ్ పాషా, జై నరసింహ,ప్రవీణ్, వెంకటేశ్వర్లు,సాయిరాం, సంతోష్,రాజశేఖర్,శ్రీను,ఎన్ సుధాకర్,రాజనర్స్,పి రవి,టి శంకర్,రఘు,బాలకృష్ణ, డి ప్రేమ్ కుమార్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు….