హైదరాబాద్ ఫిబ్రవరి 20 వై సెవెన్ న్యూస్;
రేవంత్ సర్కార్ గత 15 నెలలుగా సాగిస్తున్న పాలనలో తాను ఇచ్చిన 6 గ్యారంటీలను, ఏడో గ్యారెంటీగా ఉన్న ప్రజాస్వామీక పాలన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూడెమోక్రసీ నేడు హైదరాబాద్ మహానగరంలో వేలాది మంది ప్రజలతో ప్రజాప్రదర్శన నిర్వహించింది. సుందర విజ్ఞాన కేంద్రం నుండి బయలుదేరిన ఈ ప్రజా ప్రదర్శన ఇందిరాపార్క్ వద్ద ప్రజా మహా ధర్నాగా మారింది.ఈ ధర్నాను సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జెవి చలపతిరావు ప్రారంభించగా, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరరావు ముఖ్య వక్తగా మాట్లాడుతూ రేవంత్ సర్కార్ వెంటనే తాను ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాదిమంది ప్రజలు పక్క ఇండ్లు, రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 15 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ వైఫల్యం చెందిందన్నారు. రైతు భరోసా రైతు బీమా రైతు కూలీలకు ఇస్తానన్న 12 వేల రూపాయలు వెంటనే అమలు చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి నిర్దిష్టమైన కార్యచరణను ప్రజల ముందు ఉంచాలన్నారు. ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు చేసుకున్నాక మళ్లీ మీ సేవలో దరఖాస్తులు తీసుకోవలసిన అవసరం ఎందుకొస్తుందన్నారు. దరఖాస్తుల ప్రవాసనం వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏడవ గ్యారెంటీ అయిన ప్రజాస్వామ్య పాలన అమలు జరగడం లేదని దీనికి ఎన్కౌంటర్లు కుట్ర కేసులే నిదర్శనం అన్నారు. ప్రజాస్వామ్య పాలన అమలు చేయకపోగా లగచర్ల గిరిజన రైతంగంపై అక్రమ కేసులు పెట్టి జైలలో నిర్బంధించిందన్నారు. కార్మికుల వేతనాలు పెంచాలని బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేయాలని లేకుంటే మరోసారి తెలంగాణలో మిడిల్ ఉద్యమం ముందుకు వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో *న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, కే గోవర్ధన్ ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు V.కోటేశ్వరరావు, POW జాతీయ నాయకులు గాదె ఝాన్సీ వి సంధ్య, IFTU ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, AIKMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, PDSU జాతీయ నాయకులు P. మహేష్ మాట్లాడారు.
ప్రదర్శనలో ఇందిరా పార్కులో జరిగిన ప్రజా మహాధర్నాలో వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాల్గొన్నారు. అరుణోదయ కళారూపాలు సబికులను ఆకర్షించాయి.