E-PAPER

కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర ఓబీసీ ఉపాధ్యక్షులుగా బత్తుల వీరబాబు నియామకం

ఖమ్మం, ఫిబ్రవరి 20 వై 7 న్యూస్;

ఖమ్మం నగరానికి చెందిన బత్తుల వీరబాబు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా యువజన అధ్యక్షులుగా , వడ్డెర సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు గా కొనసాగుతూ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను గుర్తించి సిటీ కాంగ్రెస్ ఓబీసీ నగర ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు , విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళేందుకు , అలాగే బి.సి.ల సంక్షేమం అభివృద్ధికై అనునిత్యం పాటుపడతానని అన్నారు . ఎ.ఐ.సి.సి. అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గె , పి.సి.సి. అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర ఓ.బి.సి. సెల్ అధ్యక్షులు శ్రీ నూతి శ్రీకాంత్ గౌడ్ మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ పుచ్చకాయల వీరభద్రం , సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ తదితర నాయకత్వాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటానికి శక్తివంచన లేకుండా తమ వంతు శాయశక్తుల కృషి చేస్తానన్నారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్