ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు
హుజూర్ నగర్ ఎస్సై ముత్తయ్య
హుజూర్ నగర్, ఫిబ్రవరి 21 వై 7 న్యూస్;
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామానికి గురువారం 3:30 గంటల సమయంలో సిబ్బందితో వెళుతుండగా కాచవారి గూడెం స్టేజ్ వద్ద లింగగిరి వాగు నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న హుజూర్ నగర్ పట్టణానికి చెందిన యరగొర్ల గంగరాజును అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై ముత్తయ్య తెలిపారు.ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై ముత్తయ్య హెచ్చరించారు.
Post Views: 42