E-PAPER

శివుని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం

మణుగూరు, ఫిబ్రవరి 21 వై7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కట్టుమల్లారం గ్రామపంచాయతీ గన్నెబోయిన గుంపులో శ్రీ శివశక్తి మహాపీఠం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కాశీ విశ్వనాథ్ గురూజీ ఆధ్వర్యంలో, మూల చిన్నా ఆదిరెడ్డి ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శి, కటకోజ్వుల శ్రీనివాసాచారి ట్రెజరర్ పర్యవేక్షణలో ఉదయం 8 గంటల నుండి ప్రాతకాల పూజ, గోపూజ, విగ్నేశ్వర పూజ, పుణ్య ఆవాసనము,గురున్యాసము, దత్తున్యాసము బీజన్యాసము, రత్నన్యాసము,ఉదయం 10:30 నిమిషాలకు యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవము జీవకలాన్యాసము, గోజ్వాల దర్శనం, మహా పూర్ణాహుతి హోమం, శివపార్వతుల శాంతి కళ్యాణం, మహాదాశిర్వచనం, పండిత సత్కారం అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందినటువంటి వేద పండితులు కల్లేపల్లి భాస్కర శర్మ, భాస్కరుని సురేష్ కుమార్ శర్మ ,పొదిల భాస్కర శర్మ, కొండపల్లి విజయ రాహుల్ శర్మ ల మంత్రోచ్ఛారణలతో, మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో 12 అడుగుల ఎత్తైన శివుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోద్య చారి,ఉన్న లక్ష్మీకుమారి, మణుగూరు పట్టణ పుర ప్రముఖులు భక్తులు, శివ మాలదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్