E-PAPER

ప్రపంచ గర్వించదగ్గ మేధావి అంబేద్కర్

అమిత్ షా క్షమాపణలు చెప్పాలి

అంబేద్కర్ పై అమిత్ షా వాఖ్యలు వెనక్కితీసుకోవాలి

మాదిగ జేఏసీ జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు

కొత్తగూడెం,డిసెంబర్19 వై 7 న్యూస్; భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని మాదిగ జేఏసీ జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు డిమాండ్ చేశారు. మాదిగ సంఘ జేఏసీ వనభోజన ఐక్య వేదిక కన్వీనర్ చదలవాడ సూరి అధ్యక్షతన జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాదిగ జేఏసీ జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు, బహుజన సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ వేల్పుల నర్సింహారావు మాట్లాడుతూ అంబేద్కర్‌, అంబేద్కర్‌ అంటూ పదే పదే అనడం ఇప్పుడు ఓ ఫ్యాషన్‌గా మారిందని, దీనికి బదులుగా దేవుడిని ఇన్నిసార్లు స్మరిస్తే.. స్వర్గానికి వెళ్లొచ్చని సాక్షాత్తు పార్లమెంట్ లో అమిత్ షా అనడం బాధాకరమన్నారు. దేశంలోనే ఉన్నతమైన పదవుల్లో ఉండి అంబేద్కర్ ను అవమానించడం సరికాదన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ను అవమానించే హక్కు ఆయనకు లేదని, అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే ఈరోజు పార్లమెంట్లో ఉన్నతమైన పదవి అనుభవిస్తున్న అమిత్ షా, ఆ మహానుభావుడు అంబేద్కర్ పేట్టిన బిక్షాన్ని మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కించపరిచి మాట్లాడినందుకు అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశంలో దళితుల సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. లేని ఎడల విడతల వారిగా ధర్నా, నిరసన కార్యక్రమాలు, చలో ఢీల్లి కార్యక్రమం చేబడతామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో లాయర్ కే నాగేశ్వరావు, లాయర్ రమేష్, బిసి సంఘం జనరల్ సెక్రటరీ కురుమల్ల శంకర్, భూపతి శ్రీనివాస్, మాల మహానాడు నాయకులు బడుగు వీరాస్వామీ, నాగరాజు, సత్యనారాయణ, గుర్రం రమేష్ తదితరులు పాల్గోన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్