E-PAPER

సింగరేణి డే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి

కరపత్రాలు విడుదల చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు

గట్టు మహేందర్ ఎస్ సి కె ఎస్ సి ఐ టి యు శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి

శ్రీరాంపూర్,డిసెంబర్ 20 వై 7 న్యూస్

సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులపై ప్రతి విషయంలో చూపిస్తున్న వివక్ష, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా 23వ తేదీన జరిగే సింగరేణి డే రోజు కాంట్రాక్టు కార్మికులు నల్ల రిబ్బన్లతో, జెండాలతో నిరసన వ్యక్తం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు పిలుపులో భాగంగా శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఓసిపి లో కరపత్రాలను విడుదల చేసిన సింగరేణి కాంటాక్ట్ కార్మికులు. ఈ సందర్భంగా గట్టు మహేందర్ ఎస్సి కేస్ సిఐటియు శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ,సింగరేణి యాజమాన్యం ప్రతి విషయంలో కాంట్రాక్టు కార్మికులపై వివక్షను చూపుతూ, కాంట్రాక్టు కార్మికులకు చేసిన అగ్రిమెంట్ అంశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ సింగరేణి నినాదాన్నే అమలు చేయలేని పరిస్థితిలో యాజమాన్య వైఖరి కనిపిస్తుంది. కాంట్రాక్టు కార్మికులపై చూపిస్తున్న వివక్షకు, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా 23న జరిగే సింగరేణి డే ఉత్సవాల సందర్భంగా కాంట్రాక్టు కార్మికులందరు కూడా పెద్ద ఎత్తున నల్ల రిబ్బన్లతో, జెండాలను ఎగరవేసి తమ నిరసన వ్యక్తం చేయాలని కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సి కేస్ సిఐటియు డివిజన్ సహాయ కార్యదర్శి కాజీపేట రాజేశం, సంపత్ సమ్మన్న, ప్రభాకర్, రాకేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్