E-PAPER

రోలర్ స్కేటింగ్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన జిల్లా పోలీస్ శాఖ కానిస్టేబుల్ పిల్లలు

జాతీయ క్రీడలలో రజత పథకం (Silver Medal) సాధించిన, కాకినాడ జిల్లా పోలీస్ కానిస్టేబుల్స్ పిల్లలను అభినందించిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్( IPS)

Y7 న్యూస్ ప్రతినిధి (కాకినాడ జిల్లా):

కర్ణాటక రాష్ట్రంలోని, మైసూర్ లో ఈ నెల 5 నుండి 15 వరకు రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (RSFI) నిర్వహించిన నేషనల్ చాంపియన్షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరుపున పాల్గొని, జాతీయ స్థాయిలో (5-7 Age Group) సిల్వర్ మెడల్, మరియు (9-11 Age Group) నాల్గవ స్థానంలో నిలిచిన కాకినాడ జిల్లా పోలీస్ కానిస్టేబుల్స్ పిల్లలను కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్(IPS) సోమవారం అభినందించారు. విజయం సాధించిన చిన్నారులను అభినందించిన కాకినాడ జిల్లా ఎస్పీ , డిపార్ట్మెంట్ తరఫు నుండి పిల్లలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వారిని ప్రోత్సహించారు. కాకినాడ పోలీస్ కంట్రోల్ రూమ్ నందు కానిస్టేబుల్ గా పనిచేయుచున్న కుంచే రాజేష్, పి.సి. 3538 కుమారుడు అయిన కుంచే హన్షిత్, వయసు 6 సం., శుభానికేతన్ స్కూల్, కాకినాడ నందు 1వ తరగతి చదువుచు రోలర్ స్కేటింగ్ నందు ప్రతిభ చూపిస్తున్నాడని, ట్రాఫిక్ -2 పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా పనిచేయుచున్న విరోతి వీరకృష్ణ, పి.సి. 3757 కుమారుడు అయిన విరోతి రిషిశ్వర్, వయసు 10 సం., స్కైలార్క్ గ్లోబల్ స్కూల్, కాకినాడ లో ప్రతిభ చూపిస్తూ,
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, కుంచే హన్షిత్, వయసు 6 సం.పాల్గొన్నారని ఆయన తెలిపారు. 2024 మే నెలలో 5 to 7 సం. లలో చతిస్గడ్ రాష్ట్రంలోని రాయపూర్ లో జరిగిన ఓపెన్ నేషనల్స్ పోటీలలో 1-గోల్డ్ మెడల్, 1-బ్రాంజ్ మెడల్ సాదించాడని, ఆగష్టు నెలలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబతూర్ లో జరిగిన ఓపెన్ నేషనల్స్ పోటీలలో 1-సిల్వర్ మెడల్ సాధించాడని, అక్టోబర్ నెలలో జరిగిన జిల్లా స్తాయి పోటీలలో 1-గోల్డ్ మెడల్, 1-సిల్వర్ మెడల్ సాదించాడని, నవంబర్ నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ (APRSA) నిర్వహించిన 36వ రాష్ట్ర స్తాయి పోటీలలో 1-సిల్వర్ మెడల్, 1-బ్రాంజ్ మెడల్ సాదించాడని, డిసెంబర్ 5 నుండి 15 వరకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు లో జరిగిన 62వ జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (RSFI) పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరుపున 5-7 Age Group విభాగం లో అల్ ఇండియా స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించాడని కాకినాడ జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ తెలిపారు. అదే విధంగా
విరోతి రిషిశ్వర్, వయసు 10 సం. 2021 సం. లో 5 to 7 సం. గ్రూపులో పంజాబ్ రాష్ట్రంలోని మొహాలి లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరుపున పాల్గొని అల్ ఇండియా స్థాయిలో 4 వ స్థానంలో నిలిచాడన్నారు. 2022 సం. లో 7 to 9 సం..లో రాజస్తాన్ రాష్ట్రంలోని జోద్పూర్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో 2-సిల్వర్ మెడల్స్, 1-బ్రాంజ్ మెడల్ సాధింసాడని, 2022 సం., లో 7 to 9 సం.లో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరుపున పాల్గొన్నాడని, 2024 సం., లో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ స్లోటేట్ మీట్ లో 2-గోల్డ్ మెడల్స్ సాధించి, ఢిల్లీలో జరగబోవు 68వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు అండర్ -11 విభాగం లో ఆంధ్రప్రదేశ్ తరుపున ఎంపిక అయినాడని జిల్లా ఎస్.పి తెలిపారు. 2024 ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ (APRSA) నిర్వవించిన 36వ రాష్ట్ర స్తాయి పోటీలలో 2-సిల్వర్ మెడల్స్ సాధించాడని, డిసెంబర్ 5 నుండి 15 వరకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు లో జరిగిన 62వ జాతీయ స్థాయి (RSF) పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరుపున Under-11 విభాగం లో అల్ ఇండియా స్థాయిలో 4 వ స్థానంలో నిలిచాడన్నారు. మరియు జిల్లా, రాష్ట్ర, జోనల్, ఓపెన్ నేషనల్స్ పలు విభాగలలో సుమారు 60 మెడల్స్ సాధించాడని జిల్లా ఎస్పి పేర్కొంటూ పోలీస్ శాఖలో ఇంత ఉన్నత పథకాలు సాధించిన పోలిస్ శాఖ సిబ్బందికి, తమ శాఖ ద్వారా పిల్లల అభ్యున్నతికి అన్నివిధాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ కొనియాడుతూ తమ అభి ప్రాయం తెలియచేసారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్