మణుగూరు, డిసెంబర్ 6 వై 7 న్యూస్;
భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం మణుగూరు అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన పలువురు విగ్రహం వద్ద పూలమాలలు వేయడానికి మెట్లు లేకపోవడం వలన ఇబ్బంది పడ్డారు. మధ్యలో ఫౌంటెన్ ఉండడం వలన సాక్షాత్తు మాజీ పార్లమెంటు సభ్యులు మిడియం బాబురావు విగ్రహం వద్దకు చేరుకోలేక అక్కడ నిలబడిపోయారు. వారే కాకుండా విగ్రహం వద్దకు చేరుకోవడానికి కొంతమంది పెద్ద వయసు వారికి సాధ్యపడలేదు. కావున అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని గుర్తించి మెట్లు ఏర్పాటు చేయవలసిందిగా అంబేద్కర్ వాదులు,ప్రజలు, ప్రజాసంఘాలు మేధావులు కోరుతున్నారు..
Post Views: 229