E-PAPER

పోచారం భాస్కర్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్

ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే మండలానికి దారాదత్తం చేస్తా

మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్

బీర్కూర్, డిసెంబర్ 1 వై 7 న్యూస్ తెలుగు

బీర్కూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పిటిసి సతీష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని అడ్డుపెట్టుకొని ఆస్తులు సంపాదించినట్టు రుజువు చేస్తే బీర్కూర్ మండలానికి దారాదత్తం చేస్తానని మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ అన్నారు. ఆదివారం బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. బీర్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. బైంసాలో తనతో పాటు కుటుంబ సబ్యులకు కలిపి 39 ఎకరాలు మాత్రమే ఉన్నాయని, 70 ఎకరాల భూములున్నాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు మాత్రమే మొరం, ఇసుక వాడామని, మొరం, ఇసుక మాఫియాలో అక్రమంగా సంపాదించినట్టు రుజువు చేయాలన్నారు. రూ. 4.18 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, బిల్లులు ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రూ. ఐదు కోట్లు అప్పులు ఉన్నాయని, అప్పుల వివరాలను పాత్రికేయుల ముందు ఉంచారు. రాజకీయాల్లో తాను ఏనాడు డబ్బు ఆశించలేదని, ప్రతి ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపునకు ఎంతో కృషి చేశానన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి తాను ఏనాడు ద్రోహం చేయలేదని వివరించారు. ఈ సమావేశంలో రాంబాబు, పుల్లెన్ బాబురావు, శ్రీనివాస్, మారుతి, నారాయణ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :