పిట్లం డిసెంబర్ 2వై 7న్యూస్ తేలుగు
పిట్లం మండలంలోని రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత సోమవారం సోషల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల తో అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పిల్లలు మంత్రులు గా , ముఖ్య మంత్రి గా, ప్రతి పక్ష నేతలు గా , స్పీకర్ గా పదవులు చేపట్టి శాసన సభ ఎలా నడుస్తుంది, వాదనలు , ప్రతి పాదనలు ఎలా వుంటాయి, సంక్షేమ పథకాలు అమలు, ప్రతి పక్షం పాత్ర మొదలైన అంశాలు అన్ని కళ్ళకు కట్టినట్లు సభని విజయవంతం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత, సిబ్బంది విఠల్, రాజు, నబీ, సాయి బాబా, బుజ్జయ్య, పోతన, శివ నాగేశ్వర రావు, స్వరూప, నీలిమ, పుష్పాలత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నార్య, సి ఆర్ పి గోపాల్ ఠాకూర్, పిఈటీ మల్లేష్ తది తరులు పాల్గొన్నారు.
Post Views: 25