కోటగిరి డిసెంబర్ 2, వై సెవెన్ న్యూస్ తెలుగు
కోటగిరి మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన మాజీ జడ్పిటి సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివరాజ్ దేశాయ్, ఆయన కుమారుడు రాజశేఖర్ నాలుగు రోజుల క్రితం మెదక్ జిల్లా అల్లాదుర్గ వద్ద కారు ప్రమాదంలో మృతి చెందడంతో సోమవారం రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మానవ వెంకటేశ్వరరావు శివరాజ్ దేశాయ్ కుటుంబాన్ని పరామర్శించారు. శివరాజ్ దేశాయ్, ఆయన కుమారుడు రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శివరాజ్ దేశాయ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట కొత్తపల్లి సహకార సంఘం మాజీ అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్, బీర్కూరు మాజీ జెడ్పిటి సభ్యులు ద్రోణవల్లి సతీష్ ఉన్నారు.
Post Views: 27