లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ, మక్కెన
వినుకొండ, నవంబర్ 24 వై 7 న్యూస్ ప్రతినిధి;
రాష్ట్రంలో పేదలు, అవసరంలో ఉన్న వారు అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సాయం అందిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్, విను కొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు. 2014-19 మధ్య గానీ, ఇప్పుడు గానీ సీఎం చంద్రబాబు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. చికిత్సల కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న 47మంది లబ్ధిదారులకు రూ.92 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన వారందరికి మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ 2014-19లో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు ఐదేళ్లలో వినుకొండ నియోజకవర్గంలో 2,842 మందికి, రూ.11.78 కోట్లమేర సీఎంఆర్‌ఎఫ్ సాయం చేశామన్నారు. వైద్యారోగ్యం సహా అత్యవసరంలోఉన్న ప్రతిఒక్కరికీ చేతికి ఎముక లేదు అన్న రీతిలో సీఎం సాయం చేశారన్నారు. ఇప్పుడూ అడిగిందే తడవుగా.. ఒక్కటి కూడా తిరస్కరించకుండా ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో బిల్లులు రాక రోగులను వెనక్కి పంపించిన ఉదంతాలు చూశామన్న జీవీ జగన్ నెలలు, ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో తర్వాత సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడే బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు పేదరికం లేని సమాజం, ఆర్థికంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విజన్-2047 తీసుకొచ్చారన్నారు. 2047 కల్లా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతాయని, మరో 23ఏళ్లలో ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ప్రతివ్యక్తి, కుటుంబం తలసరి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, పారిశ్రామికవేత్తను తయారుచే యాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని తెలిపారు. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ప్రపంచం లోని ఏపీ మొదటిస్థానంలో ఉండాలనే లక్ష్యంతో సీఎం ప్రణాళికలు చేపట్టారన్నారు. ఆరోగ్యాంధ్ర ప్రదేశ్, ఆనందాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని, లైఫ్ ఇండెక్స్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. అందుకోసమే బడ్జెట్‌లో వైద్యారోగ్యశాఖకు రూ.18,421 కోట్లు కేటాయించారని తెలిపారు. 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలుకల్పించేలా కార్యాచరణ చేపట్టారని, నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, డిప్యూటీ సీఎం పవన్ ఉపాధి హామీ పథకం పనులను చాలా చక్కగా పర్వవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.