E-PAPER

లోక్ మంథన్ ఎగ్జిబిషన్ లో జిల్లా కి చెందిన ఆదివాసి కోయ కళాకారుల బృందాల ప్రదర్శన

ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము,వెంకయ్యనాయుడు,కిషన్ రెడ్డి

అశ్వాపురం,నవంబర్24 వై సెవెన్ న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి చెందిన ఆదివాసి కోయ కళాకారుల బృందాలు హైదరాబాదులో నిర్వహిస్తున్న లోకమంథన్ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చాయి.అందులో ఆదివాసి కోయ ఇలవేల్పు డాలు గుడ్డ ప్రదర్శన, ఆదివాసి కోయ డోలి ప్రదర్శన, ఆదివాసి కోయ గుజ్జడి మొగ్గలు ప్రదర్శన మరియు ఆదివాసి కోయ కొమ్ము నాట్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పాల్గొన్నారు.ఇది భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే లోకమంథన్ ఆదివాసి చిత్రకళ.ఈ ప్రదర్శనకి భారతదేశదేశం నలుమూలల నుండి వచ్చి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.
ఆదివాసి ఇలవేల్పు డాలు గుడ్డ ప్రదర్శనలో ఎలకలగూడెం గ్రామం అశ్వాపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తోలెం కళ్యాణ్ తోలెం వెంకటేశ్వర్లు ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News