కరీంనగర్ నవంబర్14 వై 7 న్యూస్
వివాహానికి హాజరైన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ
7వేల మందికి అద్భుతమైన విందు ఏర్పాట్లు
కరీంనగర్:కాంగ్రెస్ పార్టీ టీపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏం ఏ సమాద్ నవాబ్ కుమారుడు,ఎంఏ అహాద్ నవీద్ సోదరుడు ఎం ఏ హలీం నవాజ్ వివాహ రిసెప్షన్ వేడుకలు కరీంనగర్ లోని వీ కన్వెన్షన్ హాల్లో సోమవారం ఘనంగా జరిగాయి.ఈ వివాహ వేడుకల్లో రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు,వడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ రిసెప్షన్ లో దాదాపు 7వేల మందిని పిలిచి అద్భుతమైన విందు ఏర్పాట్లు చేశారు.ఈ విందులో పలు పార్టీల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post Views: 92









