E-PAPER

డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్చలు జరపాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశి

జూలూరుపాడు, అక్టోబర్ 15 వై 7 న్యూస్;
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారని, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక భవనాలకు కిరాయిలు చెల్లించలేక ప్రవేట్ డిగ్రీ పీజీ కళాశాలలు యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాల నుండి ఫీజు బకాయిల విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బందు చేస్తున్నట్టు ప్రకటించారని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికి స్పందించకుండా మౌనంగా ఉండడం సరికాదని వారన్నారు. ఇప్పటికే అనేక సెలవులు రావడం వల్ల విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో వెనకబడ్డారని మళ్ళీ నిన్నటి నుంచి డిగ్రీ పిజీ కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకు నిరవధికంగా బందు చేస్తా విద్యార్థులు తరగతులు నిర్వహణకు సెమిస్టర్ పరీక్ష నిర్వహణకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలు మొత్తం ఒకేసారి విడుదల చేస్తామని ‌ చెప్పారు. ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేడు ముఖ్యమంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేయడం అన్నారు. అనేక రకాల ఖర్చులు చేస్తూ అనేక చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఫీజు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యం చర్చలు జరిపి వారికి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంపై హామీ ఇవ్వాలని కోరారు, లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు రకాలు విడుదల అయ్యే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!