. ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్
పటాన్ చెరువు;అక్టోబర్02 వై 7 న్యూస్;
పటాన్ చెరువు పట్టణంలోని శివాజీ పుత్ర యూత్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొని వెళ్లారు.ఈ కార్యక్రమంలో ఎం డి ఆర్ ఫౌండేషన్ కో – ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొన్నారు. ప్రజలంతా నవరాత్రి, బతుకమ్మ, దసరా పండగలను సంతోషంగా, భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ దుర్గా అమ్మవారి కరుణా, కటాక్షాలు అందరి మీద ఉండాలని ఆయన మొక్కుకున్నారు.
Post Views: 58