. భవన నిర్మాణానికి పేపర్ ప్రకటన సైతం లేకుండానే
. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ సైతం చూపించని వైనం
. నిర్మాణానికి 30 లక్షల రూపాయలు అయితే అదనంగా మింగేసారంటూ ప్రచారం
. నిర్మాణం పూర్తయిన ఐదవ నాటినుండే భారీ పగుళ్లు
. మాంత్రికుడు మాయాజాలంతో భవన నిర్మాణ’లీలా’ !
వై సెవెన్ న్యూస్ భద్రాద్రి డెస్క్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం సొసైటీ కార్యాలయాన్ని సొంత నిర్ణయాలతో నిర్మించారని నాడు నాసిరకంగా కొనసాగించడం వల్ల నేడు పగుళ్లతో దర్శనమిస్తుందని, ఎటువంటి అనుమతులు లేకుండానే సొంత నిర్ణయాలతో కొనసాగించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. నిజానికి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఓ భవన నిర్మాణం కొనసాగించాలంటే ఆన్లైన్ టెండర్లు కొనసాగించాలి. అటువంటి టెండర్లను ఎవరైతే కాంట్రాక్టర్ అతి తక్కువ ధరలకు టెండర్ లో పాల్గొన్న వారికే అటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం వారిని నిర్ణయిస్తుంది అటువంటి పనులకు ఇసుక, సిమెంటు, ఐరన్, ఇటుక, కంకర్, కలర్స్, వంటి ముడి పదార్థాలను కాంట్రాక్టర్ ప్రభుత్వ జిఎస్టి లోనే నమోదు కార్యక్రమాలు జరిపి పనులు కొనసాగిస్తుంటారు. ఇటువంటి పనులు సైతం ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కొనసాగుతూ అటువంటి పనులకు తగ్గట్టుగా డబ్బులు చెల్లించటం వంటి కార్యక్రమాలను సైతం అధికారుల సమక్షంలో కొనసాగించాలి. ఇటువంటి వాటికి ప్రధానంగా కమిటీని సైతం సలహాలు సూచనలు సైతం తీసుకొని పనులు ప్రారంభించే దిశగా సొసైటీ కార్యదర్శి కూడా సహకారాలు అందించాలి. కానీ నారాయణ సొసైటీ కార్యాలయంలో ఉన్న మాంత్రికుడు తన మాయాజాలంతో పాలకవర్గ సభ్యులను సైతం మాయ మంత్రాలతో అబ్రకదబ్ర అంటూ వారిని సైతం ప్రశ్నించే తత్వం లేకుండా చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా నారాయణపురం సొసైటీ నిర్మాణానికి వ్యయం సుమారు 30 లక్షల రూపాయల మేరకు అంచనాలు వేయటం, వాటికి తగ్గట్టు నిర్మాణాలు కొనసాగించడం, నిర్మాణాల దిశలో సైతం అధికారులు పర్యవేక్షణ కొరవడటం ,నేడు నిర్మాణం పగుళ్లు దృశ్యాలతో సొసైటీ రైతుల సభ్యులను సైతం ఆహ్వానిస్తుంది. ఇంత జరిగినప్పటికీ అధికార యంత్రాంగం మౌనంగా ఉండటం, ఇటువంటి పనులలో పని చేసిన ఓ జిల్లా స్థాయి అధికారులను సైతం తన రాజకీయ మాయాజాలంతో జిల్లా నుండి వేరే జిల్లాకి బదిలీ చేయించడం, వెన్నతో పెట్టిన విద్య గా మారింది. ఎక్కడ తన చేసిన నిర్మాణాలలో అవినీతులు బయటపడతాయో అని భయంతో ఆ అధికారులు సైతం వేరే ప్రదేశానికి తరలించి ఉంటారన్న ప్రచారం మండలం మొత్తం దావాల వ్యాపించింది. ఏది ఏమైనా మాంత్రికుడు మాయాజాలంలో ఏ అధికారి కానీ, ఏ కార్యదర్శి గాని, ఏ పాలకవర్గం గానీ,తన మాట వినకపోతే తన మాయాజాలాన్ని ఉపయోగించి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాడని ఆ మాంత్రికుడుకి భయపడి పని చేయడమే తప్ప చేసేదేమీ లేదని తెలుస్తుంది. ఉద్యోగాల తొలగింపులో అమాయక ఉద్యోగులు, ఉద్యోగం పోయిందని బాధతో చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో సొసైటీలో పని చేసిన సహా ఉద్యోగి కూడా సంఘటన స్థలానికి వెళ్లి సానుభూతి పరంగా పలకరించిన పరిస్థితి లేదని తెలుస్తుంది. ఏది ఏమైనా సొసైటీ నిలయంలో అంతా మాయ జాలమని, ఉన్నత స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో విచారణ కొనసాగితే, మరింత పరిశీలన చేస్తే మరెన్నో నిజాలు బయటపడే అవకాశం ఉందని, ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులను రహస్యంగా కలిసి సొసైటీ కార్యాలయంలో ఉన్న సమస్యలను వారు దృష్టికి తీసుకెళ్లి నన్ను కాపాడండి మహాప్రభువు అంటూ వేడుకున్న సంఘటనలు లేకపోలేదు. ఏ అధికారి పర్యవేక్షణ లేకుండానే సొసైటీ అంతా తన కనుసైగల్లో కొనసాగించే విధంగా ఉండాలని దృఢ సంకల్పంతో వారికి నచ్చని ఉద్యోగులను సైతం ఏదో చిన్న తప్పు చేశాడని సాకుతో ఉద్యోగం నుంచి తొలగించిన సంఘటనలు లేకపోలేదు. ఇప్పటికైనా అధికారుల స్పందించి సొసైటీ పై జరుగుతున్న అన్యాయాన్ని వెలికి తీసే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే పగుళ్లతో దర్శనమిస్తున్న నూతన భవనాన్ని అధికారులు పరిశీలన చేసి చర్యలు చేపట్టే విధంగా కార్యచరణ రూపకల్పన చేయాలని నారాయణపురం సొసైటీ రైతులు కోరుకుంటున్నారు.