E-PAPER

భద్రాచలం సమస్యలపై మరో పోరాటం తప్పదు

. ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపాల్సిందే

. ప్రభుత్వ భూముల పరిరక్షణకై భద్రాచలంలో కూడా హైడ్రాను అమలు చేయాలి.

. ఏజెన్సీ ప్రాంత గిరిజనులు మోసపోతున్నారు

. పోలవరం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీని అందించాలి

. భద్రాచలం నియోజకవర్గం కోఆర్డినేటర్లుగా పూనెం ప్రదీప్ కుమార్ ఆర్ రామారావు ల నియామకం

. టీజేఎస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర రావు

భద్రాచలం,సెప్టెంబర్ 25 వై సెవెన్ న్యూస్ ప్రతినిధి

భద్రాచలం నియోజకవర్గం లో ఎన్నో సమస్యలు అపరిస్కృతంగా ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో టిజెఎస్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు పోరాటాలు నిర్వహించనున్నట్లు టి జె ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు తెలిపారు. మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా భద్రాచలం విచ్చేసిన ఆయన తొలి మలి దశ తెలంగాణ ఉద్యమ నాయకులు తిప్పన సిద్ధులు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపాల్సిందేనని స్పష్టం చేశారు. ఐదు గ్రామ పంచాయతీల తోనే భద్రాచలం అభివృద్ధి ముడిపడి ఉందని అన్నారు. ఈ విషయంపై ఇరు తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రులు అంగీకారానికి రావాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీల విలీనం ద్వారా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భూములు తిరిగి తెలంగాణలో కలపడం వలన ఆలయ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు. భద్రాచలం నుండి పర్ణశాల వెళ్లాలంటే రెండుసార్లు ఆంధ్ర సరిహద్దులను దాటాల్సి ఉంటుందని దీంతో సరే హద్దు సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచల పట్టణంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా కు గురయ్యాయని హైదరాబాద్ తరహాలోనే భద్రాచలంలో కూడా హైడ్రాను పటిష్టంగా అమలు అమలు చేసి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో 1/70, పిసా వాల్టా చట్టాలను అధికారులు అమలు చేయడం లేదని విమర్శించారు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని ఏజెన్సీ ఏరియాలో గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూనే వారి హక్కుల పరిరక్షణకై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం నిర్మాణంతో ఆదివాసీలు తమ ఉనికిని కోల్పోతున్నారని అడవితో మమేకమైన వారి జీవనం ప్రశ్నార్ధకమైందని ఆయన అన్నారు పోలవరం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీని అందించాలని డిమాండ్ చేశారు గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఏర్పాటుచేసిన ఇసుక రీచ్ లను గిరిజనేతరులు బినామీ పేర్లతో చేజిక్కించుకొని గిరిజన చట్టాలను తుంగలో తొక్కిఇష్టానుసారంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని వీరి చేతిలో అమాయకులైన ఆదివాసీలు మోసపోతున్నారని తెలిపారు గత ప్రభుత్వం హయాంలో ఇసుక దోపిడి భారీగా జరిగిందని విమర్శించారు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలుపరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు జగన్నాధపురం నుండి భద్రాచలం వరకు సింగిల్ రోడ్డు గా ఉన్న రహదారిని జాతీయ రహదారిగా మార్చి అంతర్రాష్ట్ర సరిహద్దులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు లేనిపక్షంలో టీజేఎస్ ఆధ్వర్యంలో భవిష్యత్తు పోరాటాలను నిర్వహించనున్నట్లు వివరించారు అనంతరం టీఎస్ భద్రాచలం నియోజకవర్గం కో ఆర్డినేటర్లుగా పూనెం ప్రదీప్ కుమార్ ఆర్ రామారావును నియమించి టీజేఎస్ సభ్యత్వ పుస్తకాలను అందజేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవదానం, ఖమ్మం నియోజకవర్గం ఇంచార్జ్ బెల్లంకొండ నాగేశ్వరరావు, పినపాక నియోజకవర్గం ఇన్ ఛార్జ్ మూల నాగిరెడ్డి, టీజెఎస్ రాష్ట్ర నాయకులు నబి, సాహెబ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :