వై7న్యూస్ మిర్యాలగూడ
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయం నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మన దేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం వచ్చినప్పటికీ మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 ఆనాటి పాలకులపై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడి తెలంగాణ రాష్ట్రానికి విమోచన కలిగించింది.అలాగే నేటి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలన నుంచి మన తెలంగాణ రాష్ట్ర విముక్తి పొంది ప్రస్తుతం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా పాలన కొనసాగుతుంది .కావున తెలంగాణ రాష్ట్రం అంతటా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









