E-PAPER

నల్గొండలో ఉద్యమకారుల బస్సు యాత్రకు స్వాగతం పలికిన మిర్యాలగూడ బీసీ జేఏసీ

. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి

. ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలి అని

. బస్సు యాత్రకు స్వాగతం పలికిన తెలంగాణ ఉద్యమ కారులు

వై 7 న్యూస్, మిర్యాలగూడ

తెలంగాణ ఉద్యమ కారులకు తగిన గుర్తింపునివ్వాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఆధ్వర్యంలో హైద్రాబాద్ నుండి బయలు దేరిన బస్సు యాత్ర కు నల్లగొండ లో మిర్యాలగూడ బీసీ జేఏసి స్వాగతం పలికింది.ఈ సందర్బంగా బీసీ జెఏసి కన్వీనర్ మారం శ్రీనివాస్ రాపోలు పరమేశ్ , నల్లగంతులనాగభూషణం లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమించిన ఉద్యమ కారులను ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వకుండా విస్మరించిందని అన్నారు.తెలంగాణ ఉద్యమ కారుల కు సంక్షేమ బోర్డు ఏర్పాటు,ఉద్యమ కారుల కు పెన్షన్ తదితర డిమాండ్ల తో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రం లో జిల్లాలలో దక్షిణ తెలంగాణా ఉద్యమ కారుల బస్సు యాత్ర ను తల పెట్టింది అన్నారు.రాష్ట్ర అధ్యక్షుడు చీ మశ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతిరెడ్డి జ్యోతి, ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి లు బస్సు యాత్రకు నేతృత్వం వహిస్తున్నారు అన్నారు. ఉద్యమ కారులు ఉద్యమం లో డబ్బులు ఖర్చు పెట్టుకుని కేసుల పాలయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు.పది సంవత్సరాలు అధికారం లో బి ఆర్ ఎస్ కూడా ఉద్యమ కారులను పట్టించు కోలేదని అన్నారు.తెలంగాణ ఉద్యమ కారుల ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.సమస్యలు పరిష్కారం అయ్యే వరకు శాంతి యుతంగా ఉద్యమిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో
మీడియా అధికార ప్రతినిధి తాడూరు గగన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి జానకి రెడ్డి , టి యు ఎఫ్ టి వి చైర్మన్ వెంగళభాస్కర్ ,
ఉద్యమకారులు కొండ స్వామి, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ దయానంద్, మేడ్చల్ జిల్లా మీడియా ప్రతినిధి దాసారం శ్రీనివాస్ మరియు కార్యాలయం యొక్క ఇంచార్జ్ అవినాష్ ఊటుకూరి గిరి, గంజి వెంకటేశం, శ్రీనివాస్, (ఐ ఎన్ టి సి.327) నాయకులు ఎం రమేష్ రెడ్డి, విశ్వం, ముక్కుమూడి శ్రీనివాస్, రాంబాబు, వంశీ, చింత పరమేష్, తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News