E-PAPER

శభాష్ కన్నాయిగూడెం పోలీస్

దోపిడీ దారులకు దడ పుట్టిస్తున్న ఎస్సై

బాధితులకు అండగా ముందడుగు

నాలుగు సంవత్సరాల సమస్యకు విముక్తి కలిగించిన వీరుడు

సేవలు మెచ్చుకుంటున్న మహిళల

ఎస్సై వెంకటేష్ కు కృతజ్ఞతలు

వై సెవెన్ న్యూస్ కన్నాయిగూడెం

ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కన్నాయిగూడెం మండలంలో అమాయక ప్రజలను మోసగించి ప్రభుత్వ పథకాల పేరు చెప్పి పేదల నుండి డబ్బులు వసూలు చేసిన వారిపై కన్నాయిగూడెం ఎస్సై ప్రత్యేక నిగా పెట్టారు బాధితులు ఎవరైనా వచ్చి మేము మోసపోయామని తెలిపితే తక్షణమే స్పందిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అనేకంగా అమాయక ప్రజల వద్ద డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి అయితే పలిమెల మండలం పంకేన గ్రామానికి చెందిన దుర్గం చిలక అనే మహిళ భూమి వివాదంలో బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీకి తన సమస్య తెలిపింది దానినే ఆసరాగా భావించిన బుట్టాయిగూడెం మాజీ ఎంపీటీసీ దుర్గం చిలకమ్మా అనే మహిళ వద్ద కొంత డబ్బు డిమాండ్ చేశారు అయితే నా సమస్య తీరుతుంది అనుకున్న మహిళ ఎంపిటిసి కి డబ్బులు ఇచ్చింది.కని సంవత్సరాలు గడుస్తున్న సమస్య తీరడం లేదు తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదు ఏమిటి అంటూ ప్రశ్నించింది అయితే డబ్బులు తీసుకున్న మాజీ ఎంపీటీసీ మహిళపై బెదిరింపులకు దిగినారు సహనం కోల్పోయిన మహిళ కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ కి చేరుకున్నది విషయం కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ కు తెలపగానే వెంటనే స్పందించిన ఎస్సై రంగంలోకి దిగినారు మాజీ ఎంపీటీసీని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు బాధితురాలికి వెంటనే డబ్బు చెల్లించాలని ఆదేశించారు. దాంతో మాజీ ఎంపీటీసీ దుర్గం చిలకమ్మా అనే బాధితురాలి వద్ద వసూల్ చేసిన డబ్బు వెంటనే చిలుకమ్మకు ఇచ్చినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే నాలుగు సంవత్సరాలు ఏ పోలీస్ పట్టించుకోలేదని వెంకటేష్ ఎస్సై కి విషయం తెలపగానే స్పందించి నాకు డబ్బు ఇప్పించారని బాధితురాలు కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్