E-PAPER

కొత్తగూడెంలో 22,23 తేదీలలో జరగనున్న ఆటో యూనియన్ రాష్ట్రమహాసభలును జయప్రదం చెయ్యండి

. ఆటో క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచెర్ల జమలయ్య

అశ్వాపురం, సెప్టెంబర్ 16 వై 7 న్యూస్

తెలంగాణ రాష్ట్ర ఆటో,
క్యాబ్ , వర్కర్స్ మహాసభ లు సెప్టెంబర్ 22-23 తేదీ లో కొత్తగూడెం లో జరగనున్న నేపథ్యంలో
ఈ మహాసభ లను ఆటో ,క్యాబ్ డ్రైవర్స్ అధిక సంఖ్య లో పాల్గొని జయప్రదం చెయ్యాలి అని ఆటో క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచెర్ల జమలయ్య విజ్ఞప్తి చేశారు .
ప్రచార జీబు యాత్ర అశ్వాపురం మండలం వచ్చిన సందర్భంగా ఆటో అడ్డా లో మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ, ఆటో తెలంగాణ రాష్టం లో మోటార్ కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉన్నది అని అన్నారు ఉచిత బస్సు తో ఆటో డ్రైవర్స్ ఓనర్స్ పరిస్థితి పెనం మీద నుండి పోయి లో పడినట్లు ఉన్నది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ లు ఓనర్స్ కిస్తీలు కట్టలేక ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రము లో నెల కొన్నది అని అన్నారు. ఈ రాష్ట్ర మహా సభలు లో ఆటో కార్మికుల సమస్యలు పై చర్చ జరుగుతుంది అని అన్నారు.ఈ మహాసభ లో ఆటో కార్మికులకు
భద్రత- భరోసా కోసం ప్రభుత్వం కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి అని ,పెన్షన్ 50 ఏళ్లకు ఇవ్వాలి అని , అన్ని రకాల టాక్స్ లు రద్దు చెయ్యాలి అని , హెల్త్ కార్డు లు ఇవ్వాలి , బీమా సౌకర్యం 10 లక్షలు ఇవ్వాలి అని ప్రభుత్వం పై ఏఐటీయూసీ పోరాటం చేస్తుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో, సిపిఐ మండల కార్యదర్శి, అనంతనేని సురేష్,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్, ఆటో యూనియన్ మండల అధ్యక్షులు ఏళ్లబోయిన కోటేశ్వరరావు, సిపిఐ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు, మేలపుర సురేందర్ రెడ్డి, ఈనపల్లి పవన్ సాయి, చిలుకాని శ్రీనివాస్, ఆటో యూనియన్ నాయకులు, బోళ్ల రమణయ్య, జెట్టి రమేష్, పదిరి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్