మిర్యాలగూడ, సెప్టెంబర్ 16 వై 7 న్యూస్
భారతీయ జనతా పార్టీ ఎస్సి మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన అడ్ల రమేష్ ను నియమిస్తున్నట్లు ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా అడ్ల రమేష్ మాట్లాడుతూ, బీజేపీ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు అంకితమై నీతి, నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేస్తానని, నిరంతరం ఎస్సిలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన కొండేటి శ్రీధర్, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు.
Post Views: 87