బాన్సువాడ సెప్టెంబర్ 16 వై 7 న్యూస్
బాన్సువాడ పట్టణ కేంద్రంలో బాన్సువాడ ప్రతినిధి ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం స్టూడెంట్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎన్. బాల్ రాజ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 ను తెలంగాణ విద్రోహ దినం గా గుర్తించాలని, భూమి, భుక్తి, విముక్తి కోసం ఏడున్నర దశబ్దాల క్రితం తెలంగాణ ప్రజలు విజయ భావుట ఎగరవేయడం జరిగిందని,అప్పటి నుండి ప్రారంభమైన ఉద్యమం ప్యూడల్ నిజాం రాజ్యాన్ని కూల్చి, మెరుగైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో, సాయుధ పోరాటం ను రూపొందించి, భూస్వాముల నుండి 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలు ప్రజా సంఘాలు స్వాధీనం చేసుకొని గ్రామభివృద్ధి కమిటీల ద్వారా గ్రామ సదస్సు లల్లో పేద ప్రజలకు భూములను పంచడం జరిగిందని తెలిపారు. కమ్యూనిస్టులు, ప్రజలు కలిసి చేసిన పోరాటాల ద్వారానే నిజాం పాలనను అంతమోదించడం జరిగింది కాబట్టి ,అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రు నిజాం నవాబులు అర్ధరాత్రి చర్చలు జరుపుకొని కుమ్మకై, తెలంగాణ లో ఆనాటి ప్రధాని నెహ్రు తన సైన్యాలను వేల మందిని దింపి వందలాది మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నారు.దీనివల్ల ప్రజలు సాగు కోసం సాధించుకున్న భూమి వారి చేతుల్లో లేకుండా పోయాయి. కాబట్టి ఇది ముమ్మాటికీ తెలంగాణ కు విద్రో దినం గానే ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యు జిల్లా నాయకులు జి.లింగం, చరణ్, సాయినాథ్, శివకుమార్ లు పాల్గొన్నారు.