మణుగూరు :
మండలంలోని అతి పెద్ద చెరువు, పర్యాటక నిలయమైన పేరంటాల చెరువుకు గండి పడింది. గ్రామస్తులు గండీ పూర్చుతున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది. ఇది ఇలాగే ఉంటే, గండి పెద్దగా అయ్యి కట్ట తెంచుకొనే ప్రమాదం ఉందని.. సాంబాయిగూడెం దమ్మక్కపేట గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.పవర్ ప్లాంట్ లో భాగమైన ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన కాలనీ, గెస్ట్ హౌస్ ,యాష్ ప్లాంట్ మరియు మిగతా పవర్ ప్లాంట్ లో భాగమైన కొంత భాగం ఈ గండి వరద ప్రభావంతో నష్టపోయే అవకాశం ఉంది.
Post Views: 115