మిర్యాలగూడ, సెప్టెంబర్ 12 వై7న్యూస్
మిర్యాలగూడ జిల్లా కోసం సంవత్సరాల తరబడి ఉద్యమించమని జిల్లా ఏర్పడకపోయిన జిల్లా అర్హత గల ఐఏఎస్ అధికారి నియామకం జరిగిందని అది జిల్లా సాధన సమితి పోరాట ఫలితమేనని మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కునే సమస్యలు ఇక్కడే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ రాజు,డాక్టర్ మునీర్,మారం శ్రీనివాస్,మాలోత్ దశరథ్ నాయక్, కోల సైదులు,రతన్ సింగ్ నాయక్, తాళ్ల పల్లి రవి,మాడుగుల శ్రీనివాస్ కోరారు.జిల్లా సాధన సమితి ఆద్వర్యంలో గురువారం నూతన సబ్ కలెక్టర్ ను కలిసి, శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో సన్మానించి 100 నోట్ పుస్తకాలు,పెన్నులు అందించి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ,సాగర్ నియోజకవర్గ పరదిలో ప్రజల ప్రధాన సమస్యలు వ్యయ ప్రయాసలు లేకుండా డివిజన్ కార్యాలయంలో పరిష్కారం చూపాలని సూచించారు.భూసమస్యలు,ట్రాఫిక్, గంజాయి మత్తు పదార్థాలు వంటి సమస్యలకు పరిష్కారాలు చూపాలని,ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సాధన సమితి నాయకులు దాసరాజు జయరాజు,బంటు సైదులు,పారుక్,అంజయ్య, సైద నాయక్,నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.