నిర్మల్,సెప్టెంబర్11 వై7 న్యూస్
భైంసా పట్టణం గాంధీ గంజ్ లో నిర్వహించిన వికలాంగుల ఉచిత పరికరాల పంపిణీ రసాభాసగా మారింది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వికలాంగులకు ఉచితంగా పరికరాలు ఇస్తామని సోషల్ మీడియా లో ప్రచారం చేశారు.దానికి కొంత మంది వికలాంగులు ఎంతో ఆశతో భైంసా కు రావడం జరిగింది.తీరా ఇక్కడికి వచ్చేసరికి వికలంగుడికి యూనిక్ ఐడి నంబర్ కావాలని చెప్పారు.అది కేంద్ర ప్రభుత్వం కొంత మందికి మాత్రమే ఆన్లైన్ పోస్ట్ ద్వారా ఇచ్చారు.
అధికారులకు ఈ విషయం తెలిసిన నిర్లక్ష్యం తో యునిక్ నంబర్ కార్డులు జారీ చేయడంలో జాప్యం వహించారు.అది తెలియని వికలాంగులు ఇక్కడికి కేవలం సదరం సర్టిఫికెట్ ను తీసుకొచ్చారు.కాబట్టి వికలాంగులు కార్డులు లేవని, మీ సేవలో ఆన్లైన్ చేసిన రిజక్ట్ అని చూపిస్తున్నాయని మొర పెట్టుకొని అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు.వికలాంగులకు సరైన సమాచారం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు.కాబట్టి వెంటనే అధికారులు ఆన్లైన్ యునిక్ కార్డు,ప్రతి గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఉచిత పరికరాలు అక్కడికే పంపిణీ చేయాలని జన సేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల జిల్లా నాయకులు బురుగుల రాజు ,నరేష్, వినయ్,నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.