తూప్రాన్ సెప్టెంబర్ 12 వై సెవెన్ న్యూస్
తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలోని తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సామరస్య వాతావరణం లో నిమజ్జనాన్ని పూర్తి చేసుకునుటకు పెద్ద చెరువు కట్ట వద్ద నిమజ్జనానికి అనువైన స్థలాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ మామిళ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరెడ్డి, సిఐ రంగకృష్ణ ,తూప్రాన్ ఎమ్మార్వో విజయలక్ష్మి, ఎస్ఐ శివానందం, తూప్రాన్ పురపాలక సంఘ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కాజామొయిజుద్దీన్, కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, పల్లెర్ల జ్యోతి, రవీందర్ గుప్తా, రవీందర్ రెడ్డి ,కుమ్మరి రఘుపతి, కాంగ్రెస్ నాయకులు ఉమర్ నాగరాజు గౌడ్, అనిల్, మున్సిపల్ మేనేజర్ రఘువరన్, జూనియర్ అసిస్టెంట్ దుర్గయ్య మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది