E-PAPER

కుల గణన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్ట్ తీర్పు హర్షనియం

. ఫలించిన జాజుల పోరాటం.. కుల‌ గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు

. హర్షంవ్యక్తం చేసిన మెదక్ జిల్లా బిసిసంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్

తూప్రాన్ సెప్టెంబర్ 12 వై సెవెన్ న్యూస్

బీసీ కుల గణన చేపట్ఠాలంటూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న పోరాటం ఫలించింది. కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో బీసీల గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై హైకోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో బీసీల గణన పూర్తి చేసేందుకు.. 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సీజే అలోక్ ఆరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్‌కు తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి ఈ విషయం తెలియజేశారు. తదుపరి తీర్పును 3 నెలలకు వాయిదా వేసింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ పిటిషన్ వేశారు. బీసీల గణన పూర్తయ్యే వరకు తెలంగాణలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవద్దని స్టేట్ ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిని విచారించిన కోర్టు తీర్పును 3 నెలలకు వాయిదా వేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :