‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేయడంపై కేసు నమోదైంది
‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేయడంపై కేసు నమోదైంది. ‘మా’ కోశాధికారి శివబాలాజీ ఫిర్యాదుతో పోలీసులు చర్యలకు దిగారు. విజయ చంద్రహాస్ అనే యూట్యూబర్ ఇదంతా చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతడికి నోటీసులు ఇచ్చారు. వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు సినీ ప్రముఖులపై తప్పుడు వీడియోలు చేస్తున్నట్లు నిందితుడు చెప్పాడని వెల్లడించారు. శివ బాలాజీ దాఖలు చేసిన ఫిర్యాదుపై IT చట్టంలోని 66 C మరియు D మరియు 351(2) BNS సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
Post Views: 116