హైదరాబాద్ సెప్టెంబర్ 10 వై7 న్యూస్
బి ఆర్ ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే.. సుమోటోగా తీసుకుంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలను ముగించిన హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది .భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావ్, స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చింది. అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు. కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్ రెడ్డి లు విడివిడిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. పార్టీని ఫిరాయించినందుకు డిస్క్వాలిఫై చేయాలంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని, ఇప్పటివరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు నాలుగు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామంది.









