పోతంగల్ సెప్టెంబర్ 8 వై 7 న్యూస్ తెలుగు
పొడంగల్ మండలంలోని
కొడిచర్ల గ్రామంలో శంకరి మారుతిగొండ నివాసం ఉంటున్న ఇల్లు షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదవశాత్తు ఆదివారం కాలిపోయినది. ఇట్టి సంఘటనలో రెండు క్వింటాళ్ల బియ్యము, పప్పులు, మొదలగు నిత్యవసర సరుకులు, 1,50,000 నగదు, పుస్తెలతాడు రెండు తులాలు, పట్ట గొలుసులు 10 తులాలు, భూమి పట్టా పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ప్లాట్ల సర్టిఫికెట్లు, బట్టలు, వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయినవి. ఇట్టి కుటుంబము నిరాశ్రయులు అయినారు. రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా చేసినారు. తక్షణ సహాయం కింద బాధిత కుటుంబానికి రూ. 5000 నగదు మరియు 25 కిలోల బియ్యము అందించడం జరిగిందని తాసిల్దార్ మల్లేశం వెల్లడించారు.
Post Views: 83