E-PAPER

ఏలేరు వరదపై సమీక్షించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

. ముంపు ప్రభావిత గ్రామాలను అప్రమత్తం చేయాలి
కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు

ఏలేరు రిజర్వాయర్ కి జల ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల మూలంగా వరద ముప్పు పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు. ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలు అధికారులతో ఫోన్ ద్వారా చర్చిస్తున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలేరు రిజర్వాయర్ కి ఇప్పటికే 21 టిఎంసీలకు చేరిన క్రమంలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు ఉన్న క్రమంలో ఉప్పాడ ప్రాంతంలోని ప్రజలకు అవసరమయిన సహాయక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ పరిస్థితిని వివరిస్తూ ఏలేరు రిజర్వాయర్ కి ఇన్ఫ్లో ఉదయం 4 వేలు క్యూసెక్కులు ఉంటే సాయంత్రానికి 8 వేలు క్యూసెక్కులు ఉందన్నారు. రాత్రికి 10 వేల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేశామని తెలిపారు. పిఠాపురం నియోజక వర్గంలో జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండ్రవాడ ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం ఉంటుందని, యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కాకినాడ చేరుకుంటారు. కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షిస్తారు. ఏలేరు వరద ముప్పు పొంచి ఉన్న క్రమంలో నియోజక వర్గంలో ఉండి పరిస్థితులను పరిశీలించనున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News