మట్టి విగ్రహాలనే పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి-:దోసపాటి పిచ్చేశ్వరరావు
అశ్వాపురం, సెప్టెంబర్ 7 (వై 7న్యూస్ ప్రతినిధి);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శనివారం అశ్వాపురం సెంటర్ లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఈ సందర్భంగా దోసపాటి పిచ్చేశ్వరరావు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ అశ్వాపురం మండలం వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 165









