E-PAPER

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రజలని ఆదుకోవాలి:ఏఐటిఎఫ్ నేత గొంది ముయ్యన్న

భద్రాచలం, అక్టోబర్ 4 (వై 7 న్యూస్)

గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వీరిని ఆదుకోవాలని ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం భద్రాచలం డివిజన్ నాయకులు మాజీ ఎంపీపీ గొంది ముయ్యన్న పిలుపునిచ్చారు.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పత్తి కంది చేను మిరప వరి మొక్కజొన్న లాంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారన్నారు. అనేక జిల్లాలో ఇండ్లకు నీరు వచ్చి కట్టుబట్టలతో ప్రజలు నిరశ్రయలుగా మిగిలిపోయి ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణ నష్టం జరిగిందని, గొర్రెలు మేకలు పశువులు కొట్టుకుపోయాయని వాహనాలు కొట్టుకుపోయాయని ఈ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడిందని వారు అన్నారు. ఆదివాసి గ్రామాలలో కల్వర్టులు రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, ఆహార కొరత ఏర్పడిందని వారు అన్నారు. లక్షలాది రూపాయల నష్టం జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతుంటే రాష్ట్ర ప్రభుత్వ మాత్రం ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం సిగ్గుచేటుగా ఉందని వారు అన్నారు. ఎకరానికి 25 వేల రూపాయలు చొప్పున ఒక ఇంటికి ఎంత నష్టం జరిగిందో సర్వే చేపించి ఆ ఇంటి ఖర్చులు అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని మరణించిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్రేసియా చెల్లించాలని రాకపోకలు బంద్ అయిన గ్రామాలకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలని ఆదుకోవాలని వారన్నారు. అనేక గ్రామాలలో పత్తి చేనులకు వరదలు వచ్చి ఇసుకమేటలు పెట్టి రాత్రింబవళ్లు కష్టపడి ఆలీ తాళి పుస్తెలు తాకట్టుపెట్టి పెట్టుబడి పెట్టుకున్న పంటలు ఒక్కసారిగా నేలమట్టం కావడంతో రైతులు కళ్ళు ఎమ్మటి కన్నీరు పెట్టుకొని లబోదిబోమని మొత్తుకుంటున్నారని వారికి ఎంత చేసిన ఈ ప్రభుత్వాలు తక్కువేనని వారన్నారు. వర్షాల కారణంగా కార్మికులు కూడా పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ఏదో ఒక ఆర్థిక సాయం చేయాల్సిన బాధ్యత ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేసిన అంచనా మించి నష్టం జరిగింది కావున తక్షణమే సర్వేలు చేపించి నష్టపరిహారం చెల్లించాలని అధికారులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని వారన్నారు.ఇప్పటికే గ్రామాలలో విష జ్వరాలతో మంచాన పడ్డటువంటి ప్రజలు ఉన్నారని వారికి వైద్య సౌకర్యం కరువైందని వైద్య సౌకర్యాలు అందక అనేకమంది మరణిస్తున్న పరిస్థితి కూడా ఉందని వారన్నారు.తక్షణమే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఈ సమస్యలను పరిష్కారం చేయాలని నష్టపరిహారం, ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం కోరుతా ఉంది. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుడు ముసలి సతీష్ పిడిఎస్యు నాయకుడు ఇరఫా రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :