E-PAPER

గర్భిణీలు వైద్య సలహాలు పాటించాలి ; టీబీ నోడల్ అధికారి జయప్రకాశ్

జోగులాంబ గద్వాల జిల్లా సెప్టెంబర్ 4 వై సెవెన్ న్యూస్

గర్భిణీ స్త్రీలు, శిశువులు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ పర్సన్ జయప్రకాష్ తెలిపారు. బుధవారం ఆయన రాజోలి మండల కేంద్రము లోని సబ్ సెంటర్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకాలు గురించి వారికి అవగాహన కల్పించారు. ప్రతి ఆశా కార్యకర్త గర్భిణీ స్త్రీలను శిశువులను టీకా కేంద్రము నకు తరలించి టీకాలు ఇప్పించాలని ఆయన అన్నారు. వ్యాధి నిరోధక టీకాలు తీసుకున్న తరువాత తిరిగి రెండవ డోస్ ఎప్పుడు, ఎక్కడ వేయించుకోవాలో వారికి వివరంగా చెప్పాలని ఆయన అన్నారు. గర్భిణి స్త్రీలు టికాలతో పాటుగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడాలని దానితో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవాలి అని ఆయన మాట్లాడుతూ తెలిపారు . బరువు పనులు చేయరాదని, ఆకు కూరలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పారు, రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యులను సంప్రదించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అని ఆయన అన్నారు. గర్భిణీ స్త్రీలు కాన్పు ఇంటి దగ్గర కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కావాలని ఆయన చెప్పారు. అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని ఆయన అన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News