దమ్మపేట,అక్టోబర్ 04 వై 7 న్యూస్;
దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో ఉన్న ఏకలవ్య పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ ఆకస్మికంగా సందర్శించి ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు.
పాఠశాల యాజమాన్యానికి ముఖ్యమైన సూచనలు చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మెరుగైన విద్య, వసతులు కల్పించాలని కొద్దిపాటి మరమ్మతులు పూర్తి చేసి టాయిలెట్స్ సౌకర్యవంతంగా ఉంచాలని తెలిపారు.
హాస్టల్ భోజన మెస్ పరిశీలించి నాణ్యమైన సరుకులు అదించాలని గుత్తేదారులను మందలించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసారు.
Post Views: 36