E-PAPER

పేరంటాల చెరువు అలుగు చప్టా మరమ్మత్తులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలి.

. చప్టా దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేసి సమస్య పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

. ఆర్. మధుసూదన్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.

మణుగూరు అక్టోబర్ 03 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం పేరంటాల చెరువు అలుగు చప్టా తాత్కాలిక మరమ్మత్తులు చేసి, సాంబాయిగూడెం పగిడేరు గ్రామాల మధ్య రాకపోకలను పునరుద్ధరించాలని,చప్టా దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేసి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజా పందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. మధుసూదన్ రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం తెగిపోయిన ప్రాంతాన్ని సందర్శించి, పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పేరంటాల చెరువు అలుగు వరద ప్రవాహానికి అక్కడ నిర్మించినటువంటి చప్టా కొట్టుకపోయి సాంబాయిగూడెం, పగిడేరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. చప్టా దగ్గర తాత్కాలిక మరమ్మత్తులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను కోరారు. ఇలాంటి సమస్య ప్రతిసారి ఏర్పడుతుందన్నారు. చప్టా దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేసి సమస్య పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :