బిచ్కుంద మండలం ఆగస్టు 03 వై 7 న్యూస్;
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో
ఒకవైపు కురుస్తున్న భారీ వర్షాల వల్ల తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే, మరొకపక్క గ్రామపంచాయతీ త్రాగునీరు అందించడంలో విఫలమైందని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గ్రామస్తులు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా త్రాగు నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆరోపించారు. మంగళవారం ఉదయం మహిళలు కాళీ బిందెలతో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. తమకు తాగునీరు అందించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వర్షాకాలంలో తాగునీరు ఇవ్వడంలో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు స్పందించి బిచ్కుంద గ్రామంలో మంచినీటి ఎద్దడి తీర్చడానికి కృషి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.









