E-PAPER

గిరిజన ఆశ్రమ పాఠశాలను అభివృద్ధి పనుల నిమిత్తం సందర్శించిన ఎంఎల్ఏ జారె

దమ్మపేట,అక్టోబర్03 వై 7న్యూస్;

అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ,పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించి ఆశ్రమ పాఠశాల అభివృద్ధి కొరకు ఎంఎల్ఏ నిధుల నుంచి 20 లక్షలు మంజూరు చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ అన్నిరకాల సౌకర్యాలు కల్పించి ఆదర్శ ఆశ్రమ పాఠశాల గా తీర్చిదిద్దుతానని ఈ పాఠశాల మాత్రమే కాకుండా నియోజకవర్గం లోని అన్ని పాఠశాలల అభివృద్ధికి కృషిచేసి విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించటానికి కృషి చేస్తానని నియోజకవర్గంలో విద్యారంగానికి అధిక ప్రాముఖ్యతనిస్తానని తెలియజేశారు..

అంకంపాలెం
అంకంపాలెం గిరిజన బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని మెనూ ప్రకారం ఆహారం అందించాలని విధుల పట్ల అంకిత భావంతో పనిచేసే మంచి ఫలితాలు రాబట్టాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా సిబ్బందికి తెలియజేశారు

ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :