E-PAPER

వరద నష్టం 5 వేల కోట్లు;100 మందితో టీజీడీఆర్ఎఫ్

వరదలు, ప్రకృతి వైఫరీత్యాలు సంభవిం చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్పై ఆధారపడకుం డా తెలంగాణలో 100 మంది సభ్యులకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(టీజీ డీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేయనున్నామని సీఎం చెప్పారు. 8 బృందాలు ఈ పనిలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఒక వ్యవస్థనే తీసుకు రానున్నట్టు వెల్లడించారు.

జిల్లా మోతెలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రాష్ట్రానికి తక్షణ సాయం కింద రూ. 2 వేల కోట్లు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానని అన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తా మని చెప్పారు. చనిపోయిన పశువులకు రూ.50 వేల చొప్పున, జీవాలకు రూ. 5 వేల చొప్పున పరిహారం అందిస్తామని వివరించారు. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు ప్రజలకు అండగా ఉంటూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప రజలకు అండగా ఉంటూ సేవలందిస్తున్న అధికారులకు సీఎం అభినం దనలు తెలిపారు. అధికారుల ముందుచూపు వల్లప్రా ణనష్టం తక్కువగా ఉందని అన్నారు.

సీఎంఆర్ఎఫ్ కు విరాళాలివ్వండి

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని కార్పొరేట్ సంస్థలు, స్వచ్చంద సంస్థలకు ముఖ్య మంత్రి విజ్ఞప్తి చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సాయం అందించారని, అలాగే ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం నిబద్దతో బాధ్యతాయుతంగా ప్రజలను అన్ని విధాలుగా ఆదు కునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు..

హోం మంత్రి రాష్ట్రంలోని వరదల పరిస్థితిపై తనతో ఫోన్ లో చర్చించారని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. ఇండ్లు కూలిపోయిన వారికి ప్రధానమంత్రి అవాస్ యోజన కింద కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తామని వివరించారు.

సాగర్ కెనాల్ గండి పరిశీలన

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బయల్దేరారు. మార్గమధ్యంలో పాలేరు సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని పరిశీలించారు. కోతకు గురైన రోడ్డును పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు ఉన్నారు.

రేవంత్ రెడ్డి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న వాళ్లు గతంలో వరదలు వచ్చినప్పుడెలా స్పందించారో అందరికీ తెలుసునని సీఎం అన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం పై బురద రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఇలాగే అబద్దాలు చెబితే ప్రజలు వాళ్లకు నిజాలు చెప్పే సందర్భం వస్తుందని అన్నారు.

కేంద్ర మంత్రులు చొరవ చూపాలి

రాష్ట్రంలో విపత్కర పరిస్థితులను పరిశీలించేందుకు రావాలని ప్రధానిని కోరినట్టు సీఎం చెప్పారు. రాష్ట్రానికి తక్షణ సాయం కింద రూ. 2 వేల కోట్లు కేటాయిం చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానని అన్నారు. తక్షణ సహాయ సాయం కింద రూ.2వేల కోట్లు విడుదల చేసే విధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ము ఖ్యమంత్రి అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :