E-PAPER

అశ్వాపురం మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎంఎల్ఏ పాయం

వెంకటాపురంలో వరదలకు కొట్టుకుపోయిన కుటుంబానికి 5 లక్షల చొప్పున కలెక్టర్ చెక్కులు అందజేత

అశ్వాపురం,సెప్టెంబర్ 02 వై 7న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని పలు గ్రామాలలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. అందులో భాగంగా మండల పరిధిలోని మొండికుంట గ్రామంలోని తుమ్మలచెరువు అలుగు ఉదృతని పరిశీలించి నిట మునిగిన వరి పొలాలను పరిశీలలించిన పినపాక శాసనసభ్యుల పాయం వెంకటేశ్వర్లు. అనంతరం పలు గ్రామాలు పర్యటించి వరద బాధితులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎట్టి పరిస్థితుల్లో మీ ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని కోరారు. మొండికుంటలో తోగువాగు లో కొట్టుకుపోయి మరణించిన వెంకటాపురం గ్రామానికి చెందిన కల్లూరి నీలమయ్య, తాటి ఆదెమ్మ కుటుంబాలకు కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేసిన జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, తుక్కని మధు,ఓరుగంటి రమేష్ బాబు,ముత్తినేని సుజాత, కమటం నరేష్,తెల్లం వీరభద్రం, ఎక్కటి సత్యనారాయణ, సురకంటి వెంకటరమణారెడ్డి, భూ రెడ్డి, కోమటిరెడ్డి,ఆవుల రవి, తూము వీర రాఘవులు, కొండలరావు, బచ్చు వెంకటరమణ, గొల్లపల్లి నరేష్ కుమార్, షారుక్ పాషా తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :