బైంసా,సెప్టెంబర్02 వై 7 న్యూస్;
బైంసా పట్టణంలో సోమవారం పొలాల అమావాస్య పండుగను నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో కిసాన్ గల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఎంఎల్ఏ మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యము లేదని, రైతన్నలు దేశానికి వెన్నుముక అని ,పరమేశ్వరుని కృప ఎల్లప్పుడూ రైతులకు ఉండాలని, వాన కాలంలో తడుచుకుంటూ చలికాలంలో వణుకుతూ ఎండాకాలం కష్టపడుతూ,రైతులు పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర మంచిగా రావాలని, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,రైతులందరికీ ఎంతో ఇష్టమైన పండుగ పోలాల అమావాస్య అని, రైతుకు వెన్ను దన్నుగా నిలిచే కాడెద్దులను గోవులను పూజించే మన హిందూ సంస్కృతి గొప్పదనాన్ని
పండగ వేల ప్రజలందరికీ పొలాల అమావాస్య జరుపుకోవాలని, ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణానికి చెందిన అన్ని వాడల వారు, రైతులు తమ యొక్క ఎడ్లను అలంకరించుకొని కిసాన్ గల్లీలోని రోకట్ హనుమాన్ టెంపుల్ వద్దకు తీసుకొని వచ్చి నంది ఈశ్వర్ ల చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ తమ ఇంటికి వెళ్లి ఎడ్లకు మంగళారతులు నైవేద్యాలతో రైతులు పూజించారు.
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఎక్స్ చైర్మన్ గంగాధర్, వివిధ గ్రామాల నుండి వచ్చిన
సర్పంచులు ఉప సర్పంచ్ లు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.