తూప్రాన్ ఆగస్టు 31 వై సెవెన్ న్యూస్;
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని 16వ వార్డులో వ్యాధులు ప్రబలకుండా క్రిమిసంహారక మందుల పిచికారి చేయాలని మున్సిపల్ అధికారులకు బిఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షులు షేక్ బురాన్ కోరడం జరిగింది. వర్షాకాలం సీజన్ కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తూప్రాన్ మున్సిపల్ లోని వివిధ వార్డులలో ఈగలు, దోమలు విపరీతంగా వ్యాపించి ఉన్నాయి. దీనివలన విష జ్వరాలు, డెంగ్యూ, కలరా,టైఫాయిడ్, వ్యాధులు సోకకుండా మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని ఈగల, దోమల నివారణకు క్రిమిసంహారక మందులను పిచికారి చేయాలని కోరడం జరిగింది.
Post Views: 144









