. రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన మాల మహానాడు అధ్యక్షులు పూల. రవీందర్
భద్రాచలం ,ఆగస్టు30 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నందు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అల్లాడి. పౌల్రాజ్ నాయకత్వంలో భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు మాల మహానాడు నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలకు జాతీయ మాల మహానాడు జాతీయ సెక్రెటరీ తుప్పుడు.శివకుమార్ పూల. రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై దీక్షలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ మాట్లాడుతూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, మాల మహానాడు నాయకులు అల్లాడి.పాల్రాజు తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని, రాష్ట్రంలో మొట్టమొదటగా నడుం బిగించి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నందుకు వారికి వారి బృందానికి శుభాకాంక్షలు తెలియజేసినారు. వర్గీకరణ ముసుగులో మనువాదులు రాజ్యాధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఈ విషయాన్ని దళితులైన 54 ఉపకులాల వారు గ్రహించి ఈ కుట్రలను తిప్పి కొట్టాలని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని,రానున్న కాలంలో ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప చేస్తామని, రిలే నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని, వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు వెనకకు తీసుకునే వరకు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటం ఆగకుండా వివిధ రూపాలలో కొనసాగుతుందని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డేగల. వంశీ, శివ,సరళ.వెంకటేష్ , సందీప్, వెంకన్న, రాఘవులు, రామకృష్ణ, కార్తిక్,సత్తిబాబు, సురేష్,వెంకటేశ్వర్లు, ఉప్పర్ల. వీరయ్య తదితర భద్రాచలం మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.