నర్సాపూర్,ఆగస్టు30 వై 7 న్యూస్;
నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో గతవారం రోజుల క్రితం తల్లి చనిపోవడంతో ఆనాధలుగా మారిన ఇద్దరు మగపిల్లలను,ఒక ఆడపిల్లను(తండ్రి 6 నెలల క్రితం చనిపోయారు) వారి బంధువులతో కలసి సేవాభారతి-వివేకానంద ఆవాసం మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇద్దరు మగ పిల్లల్ని బైంసా వివేకానంద ఆవాసం తీసుకుంటుందని,బాలికను హైదరాబాద్ వైదేహి ఆశ్రమం లేదా జగిత్యాల బాలికల ఆవాసం పంపుతామని శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు శైలేష్ మాశెట్టివార్,కార్యదర్శి కె.నారాయణ, నాగమణి లింగన్న, సరుకొండ దామోదర్, వెల్మ లింగా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్.యస్.యస్.కార్యకర్తలు షేర్ నరేందర్,మంద లింగన్న, జాదవ్ విఠల్ రావు,రాజేందర్,సుభాష్,బర్కుంట నరేందర్ పిల్లల బంధువులు పాల్గొన్నారు.
Post Views: 169









