E-PAPER

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన చైర్ పర్సన్, వైస్ చైర్మన్

హుజూర్ నగర్, ఆగస్టు 30 వై 7 న్యూస్;

 

హుజూర్ నగర్ టౌన్ పరిధిలో భాగంగా 25వ వార్డులో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను మంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి,4 వార్డ్ కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరావు,25వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సులువ చంద్ర శేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఒకేసారి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని, రుణమాఫీ కాని వారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తప్పనిసరిగా రుణమాఫీ జరుగుతుందని, రుణమాఫీ ఒకేసారి చేస్తే తట్టుకోలేని ప్రతిపక్షాలు లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని, కొత్త రేషన్ కార్డులను త్వరలోనే ఇవ్వనున్నట్లు, ఈనెల సెప్టెంబర్ 17 నుండి పది రోజులపాటు ప్రజల వద్ద నుండి రేషన్ కార్డు , హెల్త్ కార్డు కొరకు ప్రజా పాలన నిర్వహించుచున్నామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవలన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లు శాంక్షన్ అయిన లబ్ధిదారులు బుడిగ భారతమ్మ, దగ్గుపాటి రాణి, గడ్డం ఉమా వీరయ్యలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News