తనిఖీలు చేయడానికి వచ్చారా?…. కాఫీలు తాగడానికి వచ్చారా?
. సామాజిక కార్యకర్త కర్నె రవి తీవ్ర ఆరోపణలు
• తు తు మాత్రంగా తనిఖీలు నిర్వహించన డిఎంహెచ్వో
• మణుగూరు పట్టణం లో ప్రవేట్ హాస్పిటల్స్, మెడికల్ షాపు లేదే ఇష్ట రాజ్యం
మణుగూరు,ఆగస్టు30 వై 7 న్యూస్;
మంగళ వారం సామాజిక కార్యకర్త కర్నె రవి ఇచ్చిన పిర్యాదు మేరకు శుక్రవారం మణుగూరు పట్టణం లో డిఎంహెచ్వో భాస్కర్ నాయక్ తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం మణుగూరు పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త కర్నె రవి మంగళ వారం ఇచ్చిన పిర్యాదు మేరకు శుక్రవారం మణుగూరు పట్టణం లో డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు . తనిఖీల కంటే ప్రవైట్ హాస్పటల్, మెడికల్ షాపు లలో తూ తూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి కాఫీ, టీ లు తాగడానికి వచ్చారా అని సామాజిక కార్యకర్త కర్నె రవి తీవ్రంగా విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో పెద ప్రజల రక్తాన్ని కొన్ని కొన్ని హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, రక్త పరీక్ష కేంద్రాలు పేదవాడి రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంటే అధికారులు ఏ మాత్రం పట్టించుకునే దాఖలాలు లేవు అని తెలిపారు.. శుక్రవారం వచ్చి ఏదో మొక్కు బడిగా ఒక్క రక్త పరీక్ష కేంద్రాన్ని సీజ్ చేశారు అంతే తప్పా పెద ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు.. అంతే కాకుండా అనుమతులు లేని మందులు ఎన్నో వాడుతున్నట్లు వాటి పై కనీస చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని కర్నె రవి తెలిపారు.